Students Farming | ధర్మారం జూలై 15: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని స్మార్ట్ కిడ్స్ (Smart Kids) ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం వ్యవసాయ క్షేత్ర పర్యటన (Farming Field Visit) చేశారు. పాఠశాల షెడ్యూల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాల యజమాన్యం వ్యవసాయ క్షేత్ర పర్యటనకు ధర్మారం శివారులోని పంట పొలానికి తీసుకెళ్లింది. వరి ఎలా పండిస్తారనే విషయాలను సమగ్రంగా పాఠశాల హెడ్మాస్టర్ బుధారపు రమాదేవి, కరస్పాండెంట్ బుధారపు
మహేందర్ విద్యార్థులకు వివరించారు.
సాగు చేయడానికి ముందు రైతులు తాము ఎంచుకున్న విత్తనాలతో (Seeds) వరి నారు పోసి ఎదిగిన అనంతరం కూలీలు నాటు వేస్తారని వారు వివరించారు. నాటు వేసిన తర్వాత ఎరువులు, కలుపు తదితర విషయాలను విద్యార్థులకు వెల్లడించారు. ఆరుగాలం ఎంతో కష్టించి వరి పండించి సమాజానికి ఆహారాన్ని అందిస్తున్న ఘనత రైతులదేనని (Farmers) వారు తెలిపారు. రైతు లేనిదే రాజ్యం లేదని వారే దేశానికి ఆహారాన్ని అందించే వెన్నెముక అని ఈ క్షేత్ర పర్యటనలో విద్యార్థులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరి నాటు వేసే విధానాన్ని తెలుసుకొని విద్యార్థులు, పాఠశాల మహిళా ఉపాధ్యాయులు ప్రయోగాత్మకంగా వరి నాట్లు వేశారు.