ICC : వచ్చే ఏడాది జరుగనున్న పురుషుల వన్డే వరల్డ్‌కప్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మరింత ఆసక్తికరంగా మార్చేసింది. 14 జట్లతో సూపర్ సిక్స్ దశ, సెమీ-ఫైనల్, ఫైనల్.. ఇలా కొనసాగాల్సిన మెగా ఈవెంట్లో కీలక మార్పులు చేసింది ఐసీసీ. తక్కువ ర్యాంకున్న జట్లను దృష్టిలో పెట్టుకొని సూపర్ సిరీస్‌కు రూపమిచ్చింది అత్యున్నత క్రికెట్ బోర్డు. అంతేకాదు.. సూపర్ 6కు బదులు సూపర్ 7 రౌండ్ తెరపైకి వచ్చింది. దాంతో.. పెద్దజట్లతో పోటీపడలేని పసికూనలకు కూడా ముందంజ వేసే అవకాశం లభించనుంది.
పరుషుల వన్డే వరల్డ్‌కప్ 2027 ఫార్మాట్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది ఐసీసీ. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో 14 జట్లు పోటీపడనుండగా.. చిన్న జట్లకు అనుకూలంగా సరికొత్తగా ‘సూపర్ సిరీస్’, ‘సూపర్ 7’ రౌండ్లను ప్రవేశపెట్టింది ఐసీసీ. అంటే.. పద్నాలుగు జట్లలో చివరి మూడు ర్యాంకులోని టీమ్‌లు సూపర్ సిరీస్ రౌండ్లో తలపడుతాయి. ఈ రౌండ్ ఫలితాల ఆధారంగా ఒక జట్టు గ్రూప్ దశను దాటుంతుంది. మిగతా రెండు టీమ్‌లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.
BREAKING: The ICC has announced major changes to the format of next year’s men’s ODI World Cup.
It will remain a 14-team event, but the three lowest-ranked teams will now play a ‘super series’ round for one spot in the main group stage, with two teams eliminated.
12 teams will… pic.twitter.com/89RbSAw2Mk
— Cricinfo (@cricinfo) July 15, 2026
వరల్డ్‌కప్ గ్రూప్ దశ తర్వాతి రౌండ్ (రెండోది)కు 12 జట్లు అర్హత సాధిస్తాయి. రెండో దశగా పేర్కొనే ఇందులో ఒక్కో గ్రూప్‌లో ఆరు జట్లు.. మొత్తం 30 మ్యాచులు ఉంటాయి. అయితే.. కొత్తగా ఐసీసీ ప్రవేశపెట్టిన సూపర్ 7 ప్రకారం ఏడు జట్లు నాకౌట్‌కు చేరుతాయి.

రౌండ్ రాబిన్ పద్ధతి అనంతరం రెండు గ్రూపుల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు.. రెండు గ్రూపుల్లో అత్యధిక పాయింట్లున్న జట్టు ఏడో జట్టుగా సూపర్ 7కు దూసుకెళ్తుంది. ఆపై.. ఈ ఏడింటిలో టాప్-4 జట్లు సెమీఫైనల్‌కు వెళ్తాయి. సెమీస్ దాటిన జట్లు టైటిల్ పోరులో అమీతుమీకి సిద్ధమవుతాయి. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21వ తేదీ వరకు జరుగనుంది.
టీ20 వరల్డ్‌కప్ సైతం ఐపీఎల్ తరహాలో అలరించనుంది. ఐదు గ్రూప్‌లు, సూపర్ 10, ఎలిమినేటర్ మ్యాచ్‌లతో ఆద్యంతం ఆసక్తిగా ఉండనుంది. గత ఎడిషన్‌లో నాలుగు గ్రూప్‌లు ఉండగా.. వచ్చే ఎడిషన్ నుంచి 20 జట్లు, ఐదు గ్రూప్‌లుగా టోర్నీ జరుగనుంది.
The ICC has introduced additional knockout games to the men’s T20 World Cup in a revamp of the tournament’s format, with two ‘eliminator’ matches – effectively quarter-finals – before the semi-finals pic.twitter.com/36mqTf3Phq
— Cricinfo (@cricinfo) July 15, 2026
ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లోని రెండు జట్లు ముందంజ వేస్తాయి. సూపర్ 8 బదులు సూపర్ 10ను తీసుకొస్తున్న ఐసీసీ.. ఐదు చొప్పున రెండు గ్రూపులుగా విభజించనుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్‌లోని రెండు.. నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఐపీఎల్ తరహాలో రెండు ఎలిమినేటర్లు ఉంటాయి.