Samantha Ruth Prabhu | టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత తన మొదటి సంతానానికి జన్మనివ్వబోతున్నట్లు సమంత అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ఆమె కథానాయికగా నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయోత్సవ వేడుకల్లో సమంత బేబీ బంప్‌తో మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా తన ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందిస్తూ, మాతృత్వాన్ని అనుభవిస్తున్న ఈ క్షణాల గురించి సమంత ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు.
‘ఈ సరికొత్త ప్రయాణం నాకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. నిజానికి నేను ఈ అద్భుతమైన క్షణం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. జీవితంలో మాతృత్వాన్ని అందుకోవాలనేది నా చిరకాల కల. అందుకే ఈ కొత్త బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడానికి నా వంద శాతం శ్రమిస్తాను’ అని ఒక ఇంటర్వ్యూలో సమంత పేర్కొన్నారు. ప్రతి పనిని ఎంతో ఇష్టపడి చేసే తనకు, ఇప్పుడు తనలో సరికొత్త శక్తి, ఆలోచనలు మొదలయ్యాయని.. భవిష్యత్తులో రాబోయే మధురమైన రోజులను ఆహ్వానించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.