గోదావరిఖని : సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రామగుండం ఎమ్మెల్యే మాట్లాడాలని బాధితులు వేడుకొన్నారు. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చిన మీరు మాపై దయవుంచి ప్లీజ్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి సమస్య పరిష్కరించాలని వారు కోరారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి మారు పేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు మాట్లాడారు.
సింగరేణిలో గత ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్న మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారంకై ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో బొగ్గు గని ప్రాంతానికి సంబంధించిన తీవ్రమవుతున్న ఈ సమస్య పై అసెంబ్లీలోమాట్లాడాలని కార్మికుల పిల్లలు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ను వేడుకున్నారు. సమావేశంలో వంగా సంతోష్ , తిరుమల శ్రీనివాస్, పొన్నం వెంకటేష్, ఆవుల రవి, డిష్ బాబు, రాజయ్య రవికుమార్, పుట్ట సత్యం, శ్రావణ్ గౌడ్, రామిల్ల సందీప్ పాల్గొన్నారు.