పెద్దపల్లి రూరల్ జనవరి 13 : పెద్దపల్లి మండలం బొంపల్లి (Bompalli) గ్రామంలో మంగళవారం నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆద్యంతం సందడిగా సాగాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సర్పంచ్ దాడి మౌనిక సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. రంగురంగుల ముగ్గులతో మహిళలు తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.
ముగ్గుల పోటీలకుముఖ్య అతిథిగా హాజరైన ఐకేపి ఏపీఎం శైలజ శాంతి మహిళలను ప్రోత్సహించారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు సర్పంచ్ తో కలిసి ఆమె బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పంబాల రాజు యాదవ్, వార్డు సభ్యులు అరికిల్ల లింగయ్య, సాయిక్రిష్ణ, మణిమేఘుల, సంతన్ కారు, అమరేందర్, పుష్పలత, సరిత, సతీష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.