జూలపల్లి, సెప్టెంబర్ 4 : అధికారం కోసం ప్రజలకు మాటిచ్చి మరిచిన కాంగ్రెస్‌పై ప్రజలు మర్ల పడాలని పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని మందోట ఏరియాలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ‘వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు’ లో భాగంగా ప్రధాన రహదారిపైవంటా వార్పు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ.. ఎన్నికల్లో హామీల వర్షం కురిపించి ఎగవేతలతో పాలన కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు.
ప్రభుత్వం రైతు బీమా ఎగ్గొట్టి రైతుబంధు బందు చేసిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లోకాంగ్రెస్ ను ప్రజలు గద్దెదింపడం ఖాయమని అన్నారు. వ్యవసాయ రంగం విధ్వంసాన్ని రైతులు జీర్ణించుకోలేక మండిపడుతున్నారని వివరించారు. ఇక్కడ పార్టీ మండల ఇన్చార్జి తమ్మడవేని మల్లేశం, మాజీ ఎంపీపీ వీసారపు వెంకటేశం, ఏఎంసీ మాజీ చైర్మన్ పాటకుల అనిల్, వైస్ చైర్మన్ లోక రవీందర్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తొగరు శ్రీనివాస్, తేలుకుంట సర్పంచ్ నాంపెల్లి సంపత్ కుమార్, నాయకులు లాల్ మహ్మద్, అంకూస్, పొలగాని సతీష్, మాజీ సర్పంచులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.