Vijay | తమిళనాడులో ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ సిటీ.. సీఎం విజయ్ ప్రకటనపై అజిత్ కుమార్ హర్షం!
Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మోటార్ స్పోర్ట్స్ సిటీని నిర్మించనున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. రూల్ 110 కింద సీఎం విజయ్ చేసిన ఈ ప్రకటనపై నటుడు, ప్రముఖ కార్ రేసర్ అజిత్ కుమార్ స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తన హర్షాన్ని వ్యక్తం చేశారు.
Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మోటార్ స్పోర్ట్స్ సిటీని నిర్మించనున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. రూల్ 110 కింద సీఎం విజయ్ చేసిన ఈ ప్రకటనపై నటుడు, ప్రముఖ కార్ రేసర్ అజిత్ కుమార్ స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తన హర్షాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులో యువతను క్రీడల వైపు మరింతగా ప్రోత్సహించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నట్లు సీఎం విజయ్ తెలిపారు. ఇందులో భాగంగానే ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ ప్రకటన మోటార్ రేసింగ్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో దేశంలోనే కీలక స్థానంలో ఉన్న తమిళనాడుకు ఈ ప్రాజెక్ట్ మరింత ప్రత్యేక గుర్తింపును తీసుకురావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్ రేసింగ్‌పై ప్రత్యేక ఆసక్తి ఉన్న నటుడు అజిత్ కుమార్.. సీఎం విజయ్ ప్రకటనపై స్పందిస్తూ అభినందనలు తెలిపారు. తమిళనాడు యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా మోటార్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అజిత్ తెలిపారు. మోటార్ స్పోర్ట్స్‌తో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తిగా ఈ ప్రాజెక్ట్‌ను భారత మోటార్ రేసింగ్ రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సీఎం విజయ్ చేపడుతున్న ఈ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని అజిత్ కుమార్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ తయారీ రంగంలో దేశంలో కీలకమైన రాష్ట్రంగా ఉంది. మోటార్ స్పోర్ట్స్‌కు కూడా రాష్ట్రంలో మంచి ఆదరణ ఉంది. చెన్నై సమీపంలోని ఇరుంగాట్టుకోట్టైలో మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్, కోయంబత్తూరులో KARI మోటార్ స్పీడ్వే వంటి ప్రముఖ రేసింగ్ ట్రాక్‌లు ఉన్నాయి.ఈ ట్రాక్‌లలో జాతీయ స్థాయిలో వివిధ కార్ రేసింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఫార్ములా 3, ఫార్ములా 4 వంటి పోటీలకు కూడా తమిళనాడు వేదికగా నిలుస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న మోటార్ స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో రేసింగ్ ట్రాక్, ఆధునిక శిక్షణా కేంద్రాలు, మోటార్ స్పోర్ట్స్‌కు సంబంధించిన ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు ఉన్నట్లు సమాచారం.భవిష్యత్తులో ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3, ఫార్ములా 4 వంటి అంతర్జాతీయ స్థాయి పోటీలను నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

