పెద్దపల్లి : ఎస్సీ రిజర్వేషన్ల(SC reservations) వర్గీకరణ అమలు చేయాలనే డిమాండ్‌తో సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో లక్ష డప్పులు(Lakha Dappulu) వేల గొంతులతో మాదిగల మహాత్తర సాంస్కృతిక ప్రదర్శన పోస్టర్లను శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్‌లో ఆవిష్కరించారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా మాదిగ, ఇతర ఎస్సీ కులాలకు తీరని ద్రోహం, మోసం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి ఈనెల 7 న హైదరాబాద్‌లో లక్ష డప్పుల లాంగ్ మార్చ్ జరగబోతున్నది.
ఇది ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ జరగని అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమం అని అందుకు మాదిగలు, ఇతర ఎస్సీ కులాలు డప్పులు, వాయిద్యాలతో సిద్దం కావాలని నాయకులు పిలుపునిచారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు పెర్క శ్యామ్, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ పి నాయకులు మామిడిపల్లి బాపయ్య, అంబాల రాజేందర్, ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ రామచంద్రం, జిల్లా అధ్యక్షులు మంథని చందు, పెద్దపల్లి మండల ఇన్చార్జి అంబాల నరేష్, రేణిగుంట్ల సాగర్, పెర్క సంతోష్, గుండా థామస్, కాదాసి చంద్రమౌళి, కుక్క రవి, బాసంపల్లి శ్రీనివాస్, ఉపేందర్, దాసరి సతీష్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.