Godavarikhani | డ్రగ్స్, సైబర్ నేరాలపై పాటలు.. వినూత్నంగా ప్రజల్లో చైతన్యం తెస్తున్న పోలీస్ కళా బృందాలు..!
Godavarikhani : గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కళాబృందంతో సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Godavarikhani : గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కళాబృందంతో సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులపై ప్రజల్లో నమ్మకం, భరోసా కల్పించేందుకు పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ల ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శనివారం గోదావరిఖని వన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠల్ నగర్లో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది.
రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాలు, మైనర్ డ్రైవింగ్, గంజాయి, చెడు వ్యసనాలు, సైబర్ మోసాలు, డయాల్ -100, మహిళలపై జరుగుతున్న నేరాలు, షీ టీమ్స్, వివిధ అంశాలను కళాబృందం సభ్యులు పాటలు, నాటకం రూపంలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్–100 సేవ ఎలా స్పందిస్తుందో, బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఎంత వేగంగా స్పందిస్తారో తెలియజేశారు. సైబర్ నేరాల పద్ధతుల్ని వివరిస్తూ, బ్యాంకుల పేరుతో వచ్చే నకిలీ కాల్స్, లింకులు, ఓటీపీ మోసాల గురించి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబరుకు సంప్రదించాలని కళాబృందం సభ్యులు ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.
పోలీస్ కళా బృందం ప్రదర్శనను ఆసక్తిగా వీక్షిస్తున్న సీఐ, ఎస్ఐ, గ్రామస్థులు

యువతలో డ్రగ్స్ వ్యసనం పెరుగుతున్న నేపథ్యంలో.. డ్రగ్స్ వాడకం వల్ల మనసు, ఆరోగ్యం, భవిష్యత్తుపై పడే తీవ్ర దుష్ప్రభావాలను తెలియజేశారు. గ్రామంలో ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ ఇంద్రసేనా రెడ్డి సూచించారు. భద్రతా వ్యవస్థను బలపరచడానికి, నేరాల నియంత్రణ, స్వీయ రక్షణకు సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అనూష, స్టేషన్ సిబ్బంది, క్రైమ్ పార్టీ సిబ్బంది, బ్లూ క్లోట్స్ సిబ్బంది, కళాబృందం సభ్యులు, కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Press meet | ‘నమస్తే’, టీ న్యూస్‌ను పిలువొద్దు.. సీఎం ప్రెస్మీట్లపై సీఎంవో నుంచి మౌఖిక ఆదేశాలు!
Teachers | ఆన్లైన్లోనే టీచర్లకు సెలవుల మంజూరు
Deeksha Divas | బొట్టు పెట్టి.. ‘దీక్షా దివస్’కు ఆహ్వానం.. 29న సభ సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ నేతల సన్నాహాలు!
Jensen Huang | జెన్సన్ రిటర్న్స్.. ఎన్విడియా సీఈవోగా మళ్లీ పగ్గాలు!
Unemployment | నిరుద్యోగ పాపం ప్రైవేటుదేనట.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు మోదీ యత్నం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

