రామగిరి ఫిబ్రవరి 25 : అర్జీ-3 ఏరియాలో ఓసీపీ -2 ప్రాజెక్టులోని రిలే ఏలో పనిచేస్తున్న సామల రామచందర్
మనువడు కనుకుంట్ల ఆశ్రిత్ (7) (బెల్లంపల్లి )బ్లడ్ క్యాన్సర్తో(Blood cancer) ప్రస్తుతం హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అత్యవసర చికిత్స కోసం రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే సామల రామచందర్ తో పనిచేసే మిత్రులు, అధికారులు, ఇతర విభాగాల కార్మికుల సహకారంతో లక్ష విరాళాలు సేకరించి మంగళవారం బాధిత కుటుంబానికి అందజేసినట్లు కార్మికులు తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో మిత్రుల కోసం ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించడం శుభ పరిణామమని త్వరగా చికిత్స పొంది బాబు ఆరోగ్యంగా ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఓసీపీ -2 కార్మికులు తెలిపారు. ఇంకా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 8121459376 కి ఫోన్ పే చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపాటి శశి కుమార్, ఎంఆర్సీ రెడ్డి, రమిడ్ల మనోహర్, మర్రి సంతోష్, రాజశేఖర్ , జనార్ధన్, రామస్వామి, సదానందం, రవి శంకర్, రాయమల్లు, అరుణ్ కుమార్, బండ సమ్మయ్య, పిడుగు సురేష్, తదితరులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతున్న బాలుడు