పెద్దపల్లి రూరల్, జూన్ 29: క్రీడా పాఠశాలల్లో విద్యాబ్యాసం కోసం జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పెద్దపల్లి నుంచి 9 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారిలో ఎనిమిది మంది బాలురు ఉన్నారని జిల్లా యువజన క్రీఢల శాఖ అధికారి సురేష్ తెలిపారు. జిల్లా యువజన, క్రీడా శాఖ ఆద్వర్యంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ మండలాలు, ప్రాంతాల నుంచి పలువురు క్రీడాకారులు పాల్గొన్నారని, ప్రతిభ ఆధారంగా 8 మంది బాలురు, ఓ బాలిక రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. వీరంతా హైదరాబాద్ హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలో ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రిపోర్ట్ చేయాలని కోరారు.
ఎంపికైన విద్యార్థులు
1. ఎస్ మోహన్నాత్ (కాల్వ శ్రీరాంపూర్)
2. కే.ఈశ్వన్ (రామగిరి)
3. కే.అద్విత్ చంద్ర (జూలపల్లి)
4. పీ.విహాన్ వర్ధన్ (కాల్వ శ్రీరాంపూర్)
5. పీ.కుశ్వంత్ (పాలకుర్తి)
6. డీ.మని రితిక్ (కమాన్ పూర్ )
7. రహమత్ అలీ (మంథని)
8. టీ.ఋషికేష్ (సుల్తానాబాద్)
9. బీ.తేజస్వి (సుల్తానాబాద్)