పైలాన్ కూల్చివేత పై సమగ్ర విచారణ జరపాలి : నగునూరి సుమలత
రామగుండం గడ్డపై చరిత్ర సృష్టించిందే కేసీఆర్ అని, అలాంటి అభివృద్ధి ప్రదాత కేసీఆర్ ఆనవాళ్లను తొలగించడం మూర్ఖత్వమని మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత ఆవేదన వ్యక్తం చేశారు.
కోల్ సిటీ, నవంబర్ 4 : రామగుండం గడ్డపై చరిత్ర సృష్టించిందే కేసీఆర్ అని, అలాంటి అభివృద్ధి ప్రదాత కేసీఆర్ ఆనవాళ్లను తొలగించడం మూర్ఖత్వమని మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. పైలాన్ కూల్చివేత పై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. గత పాలకుల గుర్తింపు రాబోయే ఎన్నికల నాటికి ప్రజల కంట పడకుండా చేయడమే లక్ష్యంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఎక్కడికక్కడ కూల్చివేతలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. స్వార్థపూరిత రాజకీయాలకు ప్రజా సొమ్మును ఖర్చు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో ఇక్కడి నాయకుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కేసీఆర్ అభివృద్ధి ఆనవాళ్లను చెరిపేసేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రోడ్డు ప్రమాదాల సాకుతో పైలాన్ ను తొలగిస్తున్నామని చెబుతున్న నగర పాలక కమిషనర్ ఏ అధికారంతో పైలాను తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే క్యాంపు ఆఫీసు మూలమలుపు వద్ద కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయనీ, అక్కడున్న ఇందిరాగాంధీ విగ్రహం తొలగిస్తారా అని ప్రశ్నించారు. పైలాన్ తొలగింపు కేవలం కక్షసాధింపు రాజకీయమేనని దుయ్యబట్టారు.
డివిజన్లలో బీఆర్ఎస్ హయాంలోని శిలాఫలకాలను ధ్వంసం చేయడం పిరికిపంద చర్య అన్నారు. అధికార పార్టీ నేతలకు ఊడిగం చేస్తున్న అధికారులను ఆ నాయకులే చివరకు నడిసంద్రంలో వదిలేస్తారని గుర్తించాలని హితవు పలికారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తే చెరిగిపోయేది కాదన్న వాస్తవంను గుర్తుంచుకొని తిరిగి పునఃనిర్మాణం చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

