Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
AlluArjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ 'రాకా' (Raaka).
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘రాకా’ (Raaka). భారీ అంచనాల మధ్య అనౌన్స్ అయిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వాయువేగంతో కాకుండా చాలా నిదానంగా సాగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందిన సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ ఇంకా సగం కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది. సినిమాను ఏమాత్రం రాజీపడకుండా, అత్యున్నత విజువల్స్‌తో తెరకెక్కించాలని అట్లీ భావిస్తున్నారు. ఇందుకోసం గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ (VFX) మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులకు భారీగా సమయం కేటాయిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సినిమాను 2027 చివరి నాటికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, సినిమా స్కేల్ మరియు అట్లీ టేకింగ్ విధానాన్ని బట్టి చూస్తే.. షూటింగ్ మరింత ఆలస్యం కావచ్చని, దీనివల్ల విడుదల తేదీ మరింత వెనక్కి వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు, చిత్ర యూనిట్ ఇప్పటివరకు ‘రాకా’ మూవీకి సంబంధించి ఎలాంటి అధికారిక అప్డేట్స్ విడుదల చేయలేదు. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది, అధికారిక రిలీజ్ డేట్ ఎప్పుడనే దానిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులకు ఈ వార్తలు కాస్త ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, అట్లీ ఎలాంటి విజువల్ వండర్ ఇస్తాడోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- alluarjun
- AlluArjunFans
- atlee
- Raaka
RELATED ARTICLES
తాజా వార్తలు
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

