పెద్దపల్లి మార్చ్ 3 ( నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో గ్రూప్-4 ద్వారా నియామకమైన వార్డ్ ఆఫీసర్స్ తమ పే స్కేల్స్ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు పీఆర్సీ కమిషన్‌కు పోస్ట్ కార్డుల ద్వారా విజప్తి చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మున్సిపల్ వార్డ్ అధికారి అనే నూతన పోస్టును క్రియేట్ చేసి జీవో ఎంఎస్ నంబర్ 109 (జులై2000) ద్వారా గ్రూప్-4లో 1862ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-4 ద్వారా నియమితులయ్యారంటే జానియర్ అసిస్టెంట్ కేడర్ ఉంటుందని కొత్తగా నియమితులైన వార్డు ఆఫీసర్లు చెబుతున్నారు.
డిగ్రీ ఉత్తీర్ణులైన వారు గ్రూప్-4 ద్వారా నియాకం అయిన వార్డు అధికారులకి జానియర్ అసిస్టెంట్‌కు ఇస్తున్న పేస్కేల్ (రూ.24,250- రూ. 72,850) ward officer scale(. 22.240- 5. 67,300). ఇంటర్ అర్హతతో ఇచ్చే రికార్డు అసిస్టెంట్ స్కేల్ ని డిగ్రీ అర్హతతో ఇస్తున్నారని పెద్దపల్లి వార్డ్ ఆఫీసర్లు స్కేల్ ని సరి చేయాలని పీఆర్సీకి వార్డు ఆఫీసర్లు విన్నవించారు. సమాన విద్యార్హతతో ఒకే నియామక పరీక్ష రాసిన వారికి ఈ వ్యత్యాసం ఎందుకని వార్డ్ ఆఫీసర్స్ ప్రశ్నిస్తునారు. టీఎన్జీవో నాయకులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని టీఎన్డీవో రాష్ట్ర నాయకత్వానికి కూడా కోరారు.