సుల్తానాబాద్ రూరల్, మార్చి 03: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లిలో సన్నబియ్యం (Fine Rice) పంపిణీని స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పులురు లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలకు సన్నబియ్యం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలుచేస్తున్నామన్నారు.
గర్రెపల్లిలో రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయని, దుకాణాలు తక్కువ ఉండడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. మరో రేషన్ దుకాణం ఏర్పాటు కోసం తీర్మానం పంపిస్తే మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి 45 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, తాసిల్దార్ ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు,నాయకులు జానీ, వెంకటేశం, రాములు, సత్యనారాయణ, తిరుపతి, లక్ష్మణ్, చక్రధర్, కొమరమ్మ ల తోపాటు తదితరున్నారు