సుల్తానాబాద్ రూరల్ మార్చి 19 : బీసీ మహిళలకి(BC women) అన్ని రంగాల్లో ప్రోత్సహం అందించాలని బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ అన్నారు.ఈనెల 18,19న ఢిల్లీ తెలంగాణ భవన్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షురాలు మట్ట జయంతి ఆధ్వర్యంలో జరిగిన ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశాల్లో మనోజ్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ 33% కోటాలో 50 % మహిళలకి సబ్ కోటా కేటాయించాలన్నారు.
మహిళల హక్కుల కోసం సంఘం భవిష్యత్లో చేసే అన్ని ఉద్యమాలకు మా మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మ్యాకల పరుశరాం, మొల్గురి అంజయ్య , విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మల్యాల సంజీవ్, నర్సింగోజు శ్రీనివాస్, నియోజకవర్గ కార్యదర్శి కూకట్ల నాగరాజు, కరీంనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటి స్వరూప, ప్రసాద్, సతీష్, కర్ణసాగర్, శ్రీపతి అజయ్ పాల్గొన్నారు.