Shobhayatra : గోదావరిఖని స్వతంత్ర చౌక్ అమ్మదళం ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన దుర్గా మాత శోభ యాత్ర (Shobhayatra)లో వివాదం చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో మంటప నిర్వాహకులు శోభ యాత్ర చేస్తుండగా డీజేలకు అనుమతి లేదని వన్ టౌన్ ఎస్ఐ కె.రమేష్ పంపించి వేశారు. అనంతరం భవానీలు, దీక్ష పరులు తిరిగి శోభయాత్రకు తిరిగి సిద్ధమవుతుండగా సీఐ ఇంద్రసేనా రెడ్డి (Indrasena Reddy) అక్కడకు చేరుకున్నారు. బ్యాండ్ కూడా అనుమతి లేదని బ్యాండ్ బంద్ చేయాలని ఆయన ఆదేశించారు.
తాము 11 ఏళ్లుగా శోభాయాత్రను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్నామని, ఎందుకు వద్దంటున్నారని నిర్వాహకులు సీఐని ప్రశ్నించారు. అన్ని మంటపాలలో డీజేలు, బ్యాండ్లు కొనసాగుతున్నాయని తమనే ఎందుకు వద్దంటున్నారని సీఐ తో వాగ్వావాదానికి దిగారు. సీఐ తీరుకు నిరసనగా స్థానిక మహిళలు, భక్తులు, భవానీలు మంటపం ఎదుట బైఠాయించి అరగంటకు పైగా ధర్నాకు దిగారు. కొంత మందికి అనుమతిస్తూ.. మరికొంతమందిని వద్దనడం ఎంతవరకూ సమంజసం అని వారు మండిపడ్డారు. స్థానిక పెద్దలు జోక్యం చేసుకోవడంతో సీఐ వెనుదిరిగారు. నిర్వాహకులు తిరిగి శోభాయాత్రను నిర్విఘ్నంగా పూర్తి చేశారు.
సీఐ తీరుకు నిరసనగా ధర్నా నిర్వహించిన మహిళలు, భవానీలు