కమాన్ పూర్, సెప్టెంబర్ 16 : అల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో యోగా విభాగం పోటీలకు పెద్దపల్లి జిల్లా జిడికే2 టౌన్ సర్కిల్ పరిధి కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ కూరపాటి శ్రీలత ఎంపికైంది.
8వ కాలనీ నివాసి కూరపాటి శ్రీలత ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో రెండవ స్థానంలో నిలిచి రజత పతకం సాధించారు.
హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీకి ట్రైనింగుకు వెళుతున్న సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ శ్రీనివాస్ తో కలిసి సన్మానించారు. అక్టోబర్ నెల 13 నుండి 17 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే నేషనల్ స్థాయి పోటీలలో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలన్నారు.