పెద్దపల్లి, ఫిబ్రవరి17: ఉద్యమ నేత, తెలంగాణ ప్రధాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి పెద్దపల్లి (Peddapalli ) మినీ ట్యాంక్ బండ్‌పై బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యాక్షుడు ఉప్పు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కేక్ చేశారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలంటూ కేక్ కట్‌చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలంటూ మరికొద్ది రోజుల్లోనే ప్రజలే ఉద్యమాలు చేస్తారని పేర్కొన్నారు.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ, తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రి పదవి అధిరోహించాలన్నారు. తెలంగాణ ప్రజలకు బంగారు బాటలు వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ మొబినోద్దీన్, వెన్నం రవీందర్, పల్లె మధు, లవన్ కుమార్, బొంకూరి నిఖిల్, బొంకూరి అఖిల్, రేండ్ల నాగరాజు, బైరం నటరాజ్, ముత్యం లక్ష్మణ్ గౌడ్, మహేష్, కుక్క మనోజ్, అతిక్, ముబషీర్, రవితేజ, తదితరులు పాల్గొన్నారు.