Sabyasachi Dutta: కోడిగుడ్లు, ఆవుపేడ, టమోటాలతో మాజీ ఎమ్మెల్యేపై దాడి.. వీడియో
Sabyasachi Dutta: తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, బిదాన్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ సబ్యసాచి దత్తపై కోడిగుళ్లతో అటాక్ చేశారు. పోలీసు స్టేషన్లోనే ఈ ఘటన జరిగింది. కోడిగుడ్లతో పాటు ఆవుపేడ, టమోటాలతో కూడా స్థానికులు అతనిపై దాడి చేశారు. బెదిరింపుల కేసులో ఆ మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు.
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, బిదాన్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ సబ్యసాచి దత్త(Sabyasachi Dutta)పై కోడిగుళ్లతో అటాక్ చేశారు. బిదాన్‌నగర్ పోలీసు స్టేషన్లోనే ఈ ఘటన జరిగింది. కోడిగుడ్లతో పాటు ఆవుపేడ, టమోటాలతో కూడా స్థానికులు అతనిపై దాడి చేశారు. బెదిరింపుల కేసులో ఆ మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. సాల్ట్ లేక్ వ్యాపారి మధుసూధర్ చక్రవర్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దత్తను అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారి నుంచి సుమారు కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంత డబ్బును దత్తకు ఇచ్చినట్లు తెలిసింది. డబ్బు తీసుకున్న గుల్లు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు.
అయితే 8 రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉండాలని స్థానిక కోర్టు ఆదేశించింది. అయితే కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో దత్తపై గుడ్లు, ఆవుపేడ, టమోటాలతో అటాక్ చేశారు.కోర్టు వద్ద మరో గ్రూపు కూడా దొంగ దొంగ అంటూ కేకలు వేశారు. బిదాన్‌నగర్‌లో దత్త అవినీతికి పాల్పడినట్లు మంత్రి శరద్వాత్ ముఖర్జీ తెలిపారు.
2000 సంవత్సరంలో బిదాన్‌నగర్ మున్సిపాల్టీలో టీఎంసీ కౌన్సిలర్ అయ్యాడు దత్త. ఆ తర్వాత 2015లో ఆయన బీఎంసీ మేయర్ అయ్యాడు. 2019లో మేయర్‌గా రిజైన్ చేసి బీజేపీలో చేరాడు. 2021లో బిదాన్‌నగర్ నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత మళ్లీ టీఎంసీలో చేరి.. బీఎంసీ చైర్పర్సన్ అయ్యాడు.
Twice in the day, Bidhannagar’s Syndicate Mafia Sabyasachi Dutta was greeted with the Egg Treatment— This time only more brutally. pic.twitter.com/K27xYuIR0G
— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) June 9, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

