Dharmaram | జాతీయ ఉపకార వేతానికి ధర్మారం మోడల్ స్కూల్ విద్యార్థుల ఎంపిక
ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు 2025 -26 విద్యా సంవత్సరంలో జాతీయ ఉపకార వేతనం ( ఎన్ఎంఎంఎస్) కోసం ఎంపికయ్యారు.
ధర్మారం, జూన్ 10 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు 2025 -26 విద్యా సంవత్సరంలో జాతీయ ఉపకార వేతనం
( ఎన్ఎంఎంఎస్) కోసం ఎంపికయ్యారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు టి. శ్రవణ్ తేజ, ఎన్. ఇందిరా ప్రియదర్శిని, టి.ఆదిత్య, ఎం.వైష్ణవి, సీహెచ్ అశ్వతేజ ఎంపికయ్యారు. వీరు 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపకార వేతనం ఏటా రూ.12,000 చొప్పున అందుకుంటారు.
ఓకే విద్యా సంవత్సరంలో తమ పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు జాతీయ ఉపకార వేతనానికి ఎంపిక కావడం ఆనందంగా ఉందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు .ఈ విద్యా సంవత్సరం నుంచి జాతీయ ఉపకార వేతనం కోసం 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆయన వివరించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

