పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమ నేత కేసీఆర్ యుగ పురుషుడని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కేసీఆర్ జన్మదినం(KCR birthday) సందర్భంగా కేక్ కట్ చేస స్వీట్లు పంచారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యమ నేతగా రాష్ట్రాన్ని సాధించడంతోపాటుగా.. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జననం చారిత్రాత్మకమన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ దాసరి మమతారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, నాయకులు బండారి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.