రామగిరి, జూలై 23: పెద్దపల్లి జిల్లాలోని ఏపీఏ డివిజన్లోని ఏఎల్పీ గనిలో గురువారం జరిగిన ప్రమాదంలో వెన్సర్ కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు గుంట మల్లేష్ తీవ్రంగా గాయపడ్డాడు. గనిలో 3వ సిమ్ లో రూఫ్ బోల్ట్ ఏర్పాటు చేస్తున్న సమయంలో యంత్రానికి సంబంధించిన బిట్ విరిగి మల్లేష్ తలపై పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేష్‌ను మొదట ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది.