పెద్దపల్లి రూరల్, జూలై 05: పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్‌లో ఉన్న మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నిర్వహించనున్న క్యాంపస్ ప్లేస్మెంట్లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కాలేజీ ప్రిన్సిపల్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఫాక్స్కాకాన్, రైటర్, తేజస్ నెట్వర్క్, ముత్తూట్ ఫైనాన్స్, టాటా టెలి సర్వీస్, టీం లీస్, జెన్ టెక్నాలజీస్, ప్రీమియర్ ఎనర్జీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కళాశాలలో క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించనున్నారని వెల్లడించారు. దీనికి ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న ఇంజినీరింగ్, ఎంబీఏ విద్యార్థులు అర్హులని తెలిపారు.
కళాశాల చైర్మన్ ఎడవెల్లి నవీన్ మాట్లాడుతూ తమ కాలేజీలో మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక ప్రయోగశాలలు, మౌలిక సౌకర్యాలు ఉద్యోగ సాధనలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. కళాశాలలో వంద శాంతం ప్లేస్‌మెంట్స్ లక్ష్యంగా పనిచేస్తున్నామని కాలేజీ డైరెక్టర్ ఏ. నవత చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్, కళాశాల అకౌంట్స్ ఆఫీసర్ పవన్ కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.