ఓదెల, ఆగస్టు 5: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీల ఆధ్వర్యంలో బుధవారం వేడుకలను నిర్వహించారు. గుంపుల, ఉప్పరపల్లి, ఇందుర్తి, పిట్టల ఎల్లయ్య పల్లి గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను తల్లులకు తెలియజేశారు. పుట్టిన పిల్లలకు డబ్బా పాలను కాకుండా తల్లిపాలనే తాగించడం వల్ల ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు.
బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలనే తాగించాలని సూచించారు. గర్భిణిలకు శ్రీమంతాలను జరిపారు. చిన్నారి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఆయా గ్రామాలలో ర్యాలీలను నిర్వహించారు. కార్యక్రమాలలో సర్పంచులు పిట్టల రవికుమార్, పడాల భాగ్యలక్ష్మి, కావటి రాజు యాదవ్, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.