ఓదెల, జనవరి 13: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలోని పురాతనమైన సమ్మక్క- సారలమ్మ జాతర కమిటీని ఎమ్మెల్యే విజయ రమణారావు నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరి రవి గౌడ్ తెలిపారు. చైర్మస్గా కొలిపాక మధునయ్య, వైస్ చైర్మన్ గా సట్ల సదయ్య గౌడ్, జాతర కమిటీ సభ్యులుగా కుంచం పూలమ్మ, పోతర్ల కొమురయ్య, దేవుడి రంగారెడ్డి, మేకల సమ్మయ్య, కల్లేపల్లి సతీష్, కవ్వంపల్లి నరేష్, కాసారపు చిన్న ఐలయ్య (హరిపురం) లతో కమిటీని వేసి ఎమ్మెల్యే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కు లేఖను పంపించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నూతన పాలకవర్గం మాట్లాడుతూ.. మేడారం తర్వాత పురాతన జాతరగా పేరొందిన కొలనూరు జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించినట్టు తెలిపారు. ఇప్పటికే ఇక్కడ రూ.95 లక్షలతో జాతర జరిగే స్థలం వరకు తారు రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. కరెంటు, తాగునీరు, ఇతర అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.