కమాన్ పూర్, ఆగస్టు 28 : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి శంకర్ – భారతిల రెండో కుమార్తె ఆనంది గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మిడియేట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. హనుమకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పరుగు పందెంలో బంగారు పతకం సాధించింది. హనుమకొండ జేఎన్ఎం స్టేడియంలో 12 తెలంగాణ స్టేట్ మీట్ సౌత్ జోన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అండర్ 18 సంవత్సరాల విభాగంలో 400 , 200 మీటర్ల పరుగు పరుగు పోటిల్లో రాష్ట్రస్థాయి గోల్డ్ మెడల్ సాధించింది.
సెప్టెంబర్ నెలలో పాండిచ్చేరిలో జరిగే సౌత్ జోన్ నేషనల్ మీట్‌కు ఆనంది ఎంపికైంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి, కోచ్ సుబ్బారావులు ఆనందిని అభినందించినారు.