కోల్ సిటీ, డిసెంబర్ 9: సమతా ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నాగేశ్వరరావు సేవకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ (జీహెచ్పీయూ) డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ విభాగంలో గౌరవ డాక్టరేట్ కు ఎంపిక చేసింది. ప్రతి ఏటా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సామాజిక సేవకులను గుర్తించి ప్రతిష్టాత్మక డాక్టరేట్ ప్రదానం చేస్తుంది.
దీనిలో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమాజ సేవలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న దుర్గం నాగేశ్వరరావుకు ఈనెల 13న చెన్నైలో జరగనున్న అమెరికా గ్లోబల్ యూనివర్సిటీ వార్షిక స్నాతకోత్సవం వేదికపై ఈ డాక్టరేట్ తో సత్కరించనున్నట్లు వ్యవస్థాపక చైర్మన్ డా.పీ. మాన్యువెల్ ప్రకటించారు. ఈ సందర్భంగా నాగేశ్వర రావు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ కు ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సామాజిక మార్పు కోసం క్రమిస్తున్న తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తోందని పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మక డాక్టరేట్ కు ఎంపిక కావడం పట్ల పలు స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.