సుల్తానాబాద్ రూరల్ జనవరి 04 : ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ దికొండ భూమేష్ కుమార్ ను స్నేహితులు ఘనంగా సన్మానం చేశారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం 1990-1991 సంవత్సరం 10వ తరగతి గర్రెపల్లిలో చదివిన పూర్వ విద్యార్థులు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూమేష్ కుమార్ను గజమాలతో ఘనంగా సత్కరించారు. భూమేష్ కుమార్ గతంలో వార్డు సభ్యుల నుంచి ఉపసర్పంచ్, ఎంపీటీసీగా అంచెలంచలిగా ఎదిగి ఎన్నో సేవా కార్యక్రమం చేసి ప్రజల మొన్ననలు పొందాడాని కొనియాడారు.
ప్రస్తుతం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ చైర్మన్ గా కొనసాగడం అభినందనీయం అన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు. విజయలక్ష్మి ,భారతి, గీత, రాజ్యలక్ష్మి, అరుణ, సునీత, వెంకన్న పటేల్, శ్రీనివాస్, దేవరాజ్, శ్రీనివాస్ రెడ్డి, ఓంకార్, రామ్మోహన్, ధర్మారెడ్డి, గౌతం, గంగయ్య, సంపత్ రెడ్డి, ఉషకార్ రెడ్డి, మధుసూదన్ రావు, హనుమంత రెడ్డి, ఆంజనేయులు, మహేష్, రవీందర్ లతోపాటు తదితరులు ఉన్నారు.