అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత
సారంగాపూర్‌లో పల్లె ప్రకృతి వనం, పంచాయతీ భవనం ప్రారంభోత్సవం
సారంగాపూర్, ఆగస్టు 13: మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో పల్లె ప్రకృ తి వనం, వైకుంఠధామం, పంచాయతీ భవనం, యాదవ సంఘం భవనాలను జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్తో కలిసి ప్రారభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ, పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. ప్రస్తుతం పల్లె లు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉన్నాయన్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమం, అభివృద్ధి ఎక్కడా ఆగలేదన్నారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, గ్రామాల సమగ్రా భివృద్ధికి ఎమ్మెల్యే సంజయ్ కృషి చేస్తున్నారని తెలిపారు. పల్లె ప్రగతితో గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్ గుర్రాల రాజేందర్‌రెడ్డితోపాటు కార్యదర్శి లైశెట్టి శేఖర్‌ను వారు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, కో ఆప్షన్ సభ్యుడు అమీర్, పీఏసీఎస్ చైర్మన్లు ఏలేటి నర్సింహారెడ్డి, గురునాధం మల్లారెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కోల శ్రీనివాస్, ఎంపీడీవో పుల్లయ్య, డీఈ మిలింద్, ప్రజాప్రతినిధులు ఏలూరి గంగారెడ్డి, ఢిల్లీ రామారావు, జోగిన్‌పెల్లి సుధాకర్‌రావు, కొత్తూరి రాజేశ్వరి, పల్లపు వెంకటేశ్, రమేశ్, ఎడమల లక్ష్మారెడ్డి, అజ్మీరా శ్రీనివాస్, బెక్కెం శ్రీనివాస్, రంజిత్, ప్రేమానందం, కోల నర్సింహారెడ్డి, గంగాధర్, రాంచందర్‌రెడ్డి పాల్గొన్నారు.