Nandi Medaram | నంది మేడారం సీహెచ్‌సీని సందర్శించిన పెద్దపల్లి డీసీహెచ్ఎస్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)ను పెద్దపల్లి డీసీహెచ్ఎస్ కే శ్రీధర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. దవాఖానలోని పారిశుధ్య స్థితిగతులను ఆయన పరిశీలించారు. దవాఖానలో ఓపీ, ఇన్‌పేషెంట్ సేవలు ఆయన స్వయంగా పరిశీలించారు.
Nandi Medaram | ధర్మారం, అక్టోబర్ 22 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)ను పెద్దపల్లి డీసీహెచ్ఎస్ కే శ్రీధర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. దవాఖానలోని పారిశుధ్య స్థితిగతులను ఆయన పరిశీలించారు. దవాఖానలో ఓపీ, ఇన్‌పేషెంట్ సేవలు ఆయన స్వయంగా పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. మందుల లభ్యత, కన్సల్టేషన్ గదుల్లో పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్న శ్రీధర్ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు.
దవాఖానలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆయన ఆదేశించారు. దవాఖాన పరిసర ప్రాంతంలో నిరంతరం పరిశుభ్రతను పాటిస్తూ, రోగులకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని ఆయన సూచించారు. త్వరలో ఇట్టి దవాఖానలో ఇన్ పేషెంట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దవఖానలో మౌలిక వసతుల కల్పన కోసం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని అవసరమైన వైద్యులతో పాటు వైద్య సామగ్రి సమకూరగానే నిరంతర సేవలు అందుబాటులోకి వస్తాయని డాక్టర్ శ్రీధర్ వెల్లడించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

