Best motivator award | పెద్దపల్లి రూరల్ జూన్ 14 : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా బెస్ట్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు. పెద్దపల్లి ఏసీపీగా గజ్జి కృష్ణ యాదవ్ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు రక్తదాతలను ప్రోత్సహించడం, ఆయన గతంలో చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సిఫారసు మేరకు రాజ్ భవన్ వర్గాలు ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ సేవలను గుర్తించి, బెస్ట్ మోటివేటర్ అవార్డుకు ఎంపిక చేయడంతో ప్రజలకు విశేష సేవలు అందించిన పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ శనివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ యాదవ్ కు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.