అంజనాద్రి!
అంజన్న క్షేత్రం కాషాయ వర్ణమైంది. ఆదివారం హన్మాన్ పెద్ద జయంతి వేడుక అంబరాన్నంటింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా లక్షమందికిపైగా దీక్షాపరుల రాకతో కొండగట్టంతా జనసంద్రమైంది.
- కొండగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం
- వైభవంగా హన్మాన్ పెద్ద జయంతి
- లక్షమందికి పైగా తరలివచ్చిన దీక్షాపరులు
- మార్మోగిన రామాంజనేయ నామస్మరణ
- 1.25లక్షల మంది రాక
- మాల విరమణకు బారులు
- రాములోరి పట్టువస్ర్తాలతో మెరిసిన అంజన్న
అంజన్న క్షేత్రం కాషాయ వర్ణమైంది. ఆదివారం హన్మాన్ పెద్ద జయంతి వేడుక అంబరాన్నంటింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా లక్షమందికిపైగా దీక్షాపరుల రాకతో కొండగట్టంతా జనసంద్రమైంది. ‘ రామ లక్ష్మణ జానకీ…జై బోలో హనుమాన్‌కీ, శ్రీ రామ జయ రామ జయ జయ రామ” నామ స్మరణతో మార్మోగింది. శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన దీక్షాపరుల రాక ఆదివారం సాయంత్రం దాకా కొనసాగడంతో ఆలయ పరిసర ప్రాంతాలు, గుట్ట కింది ప్రాంతాలు కిక్కిరిసిపోగా, యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కాగా, భద్రాచలం శ్రీ సీతారామ స్వామి దేవస్థానం తరఫున అధికారికంగా సమర్పించిన పట్టువస్ర్తాలతో స్వామి వారు మెరిసిపోగా, భక్తజనం దర్శించుకొని పులకించిపోయింది.
మల్యాల, మే 14: ‘రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హన్మాన్కీ.. శ్రీ రామ జయ రామ, జయ జయ రామ అను రామ’ నామస్మరణతో కొండగట్టు మార్మోగింది. పచ్చని వృక్ష సంపదతో అలరారే కొండగట్టు ఉప్పెనలా వచ్చిన అంజన్న దీక్షా పరులతో కాషాయవర్ణ శోభితమైంది. చినుకు చినుకు కలిసి కాలువలై, కాలువలు ఏరులైన చందంగా ఒక్కొక్కరుగా రావడం మొదలై గుంపులు గుంపులుగా అంజన్న దీక్షాపరులు గుట్టకు చేరుకున్నారు. ఆంజనేయ స్వామి దీక్షాపరులు రామనామ స్మరణలు, హన్మాన్ చాలీసాలు, అంజనేయ స్వామి దండకాలతో, ఆటపాటలతో భక్తిపారవశ్యంలో మునిగితేలారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 1.25లక్షల మంది అంజనేయ స్వామిని దర్శించుకున్నారు.
కనుల పండుగలా హన్మాన్ పెద్ద జయంతి..
ప్రతి సంవత్సరం మాదిరే ఈ సారి వైశాఖ బహుల దశమి రోజున పెద్ద హన్మాన్ జయంతిని అంజన్న సన్నిధిలో వైభవోపేతంగా నిర్వహించారు. పెద్ద జయంతి సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయం 3 గంటలకు స్వామి వారి ఉత్సవ మూర్తులకు తిరుమంజనం, ద్రావిడ పారాయణాలు చేసి చందనాలంకరణ చేశారు. అనంతరం స్వామి వారికి బాలబోగం, గిన్నె తీర్థం అందజేశారు. ఉదయం 10గంటలకు తులసీ అర్చన చేసిన అనంతరం మంగళవాయిద్యాలతో అర్చకులు పుష్కరిణి నుచి బిందెలతో నీరు తెచ్చి స్వామి వారి మూల విరాట్‌కు అభిషేకం, పంచామృత క్షీరాభిషేకం, సహస్రనాగవల్లి అర్చన వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తికి మంగళ స్నానం చేయించి, భద్రాచలం శ్రీ సీతారామ స్వామి దేవస్థానం తరపున అధికారికంగా కొండగట్టుకు అందజేసిన పట్టు వస్ర్తాలతో అలంకరించారు. జయంతిని పురస్కరించుకొని లక్ష తమలపాకులతో పాటూ ఓ భక్తుడు సమర్పించిన లడ్డూ ప్రసాదాలతో సుందరంగా అలంకరించారు.
యాగశాలలో వేదపండితులు, అర్చకులు త్రైయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించి పూర్ణాహుతిచేశారు. అనంతరం స్వామి వారికి ఊయల సేవ చేశారు. తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి వారిని గరుడవాహనంపై ఆలయ వీధుల గుండా ఊరేగించారు. చివరగా కంకణోద్వాసన కార్యక్రమాన్ని నిర్వహించి స్వామి వారలకు మంత్రపుష్పం, మహానివేదన సమర్పించి సామూహిక భజనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మితోపాటు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పలు నైవేద్యాలను సమర్పించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

