Peacock-Dies | ముకరంపుర, జులై 28 : కరీం’నగరం’లోని వావిలాలపల్లె హనుమాన్ దేవాలయం సమీపంలో జాతీయ పక్షి నెమలి విద్యుదాఘాతంతో మృతి చెందింది. కాగా స్థానికులు వావిలాలపల్లికి చెందిన కిరణ్కుమార్ ద్వారా బ్లూ క్రాస్ అధికారులకు సమాచారమిచ్చారు. కరీంనగర్ ఇన్ ఛార్జీ తూం నారాయణ అటవీశాఖ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని మృతి చెందిన నెమలిని స్వాధీనం చేసుకుని ఖననం చేశారు. సోమవారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.