Dr. Santosh Kumar Shastri | జగిత్యాల, డిసెంబర్ 10 : జాతకంలో యోగం ఉంటే ఎవరు ఆపలేరని అవకాశం తన్నుకుంటూ వస్తుందని శృంగేరి శారదపీఠం ఆస్థాన పండితులు, ప్రవచకులు, డాక్టర్. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు. జగిత్యాల రెడ్డి ఫంక్షన్ హాల్లో గత 5 రోజులుగా మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం జరుగుతుండగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది.
కళ్యాణమండపం భక్తులతో కిక్కిరిసిపోయింది. అలాగే బుధవారం పురానిపేట శివాంజనేయ స్వామి గుడి నుండి చెట్ల జానకి, బట్టు సుజాత, కొయ్యడ రమాదేవి, చిటికేశ్వర శ్రీదేవి, ఎర్ర రమాదేవిలు శివ సహస్ర నామ స్తోత్రం, మహాభారత ప్రవచన కార్యక్రమంలో భాగంగా మహిళలు చదివారు. ఈ సందర్బంగా సంతోష్ కుమార్ శాస్త్రి అభిభాషణ చేస్తూ దైవత్వంతోనే ప్రశాంతత లభిస్తుందని, కలుషితమైన ఆలోచనలు ఏ మనిషిలోనూ ఉండకూఢదన్నారు. కస్టపడి ప్రయత్నం చేస్తే పలితం లభిస్తుందని పేర్కొన్నారు.
సమాజంలో మంత్ర, తాంత్రిక విద్యలు నేటికీ ఉన్నాయని వాటితో పాటు వశికరణ ప్రయోగాలు చేస్తున్నారని చెబుతూ ఎదుటి వ్యక్తులను కష్టపెట్టే క్షుద్ర పూజలు దైవత్వం ముందుపని చేయవని చెప్పారు. డబ్బుతోనే ప్రపంచం నడుస్తుందని ధర్మం, భక్తి మార్గన్ని ప్రతీ ఒక్కరూ అనుసరించాలని సూచించారు. యోగం ఉండి ప్రయత్నం చేస్తేనే పదవులు వస్తాయని, కేవలం యోగాలతోనే ప్రజాప్రతినిధులు కారని దానికి తగ్గ కృషి చేయాలన్నారు. అన్నం కోసం మనం ఎదురు చూడాలే తప్ప అన్నం మన కోసం ఎదురు చూడవద్దని ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. మంచిని ఆచరించి చెడును విడిచిపెట్టాలన్నారు.
యోనిజం, అయోనిజం అనే పుట్టుక లుంటాయని యోనిజంలో పుట్టినవారు మనుషులని, అయోనిజులు సీత, ద్రౌపదీలని వివరించారు. ధర్మం పక్షాన గెలుపు ఉంటుందని మహాభారత కథ కూడా ఇదే చెప్తుందని, అన్నారు. వ్యసనం జీవితాలను నాశనం చేస్తుందని, మహాభారతంలో పాత్రలు రుజువు చేస్తున్నాయని అన్నారు. శ్రోతలకు కళ్ళకు కట్టినట్టు మహాభారతం గురించి వివరించారు. ప్రవచనాలకు శ్రోతలు మంత్రముగ్ధులయ్యారు. సత్య సాయి సేవ సమితి జగిత్యాల సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చెట్ల చంద్రశేఖర్, పొలాస లలితమాత ఆలయ ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప, ఎన్నం కిషన్ రెడ్డి, టీవీ సూర్యం, శీల శ్రీనివాస్, మార కైలాసం, కోటగిరి శ్రవణ్ కుమార్,పాంపట్టి రవీందర్, బోనగిరి రామనారాయణ, మార రాజేశం, నూనె కుమార్, ఎర్ర అశోక్, జిల్లా ప్రభాకర్, క్యాస శేఖర్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, చెట్ల జానకి, వనజ, తదితరులు పాల్గొన్నారు.