సర్కారు దవాఖానలో నీటి కటకట
కేసీఆర్ పాలనలో కార్పొరేట్‌కు దీటుగా సేవలందించిన ప్రభుత్వ దవాఖానలు ఇప్పుడు మొండికేస్తున్నాయి. సర్కారు నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని ఆర్థోపెడిక్ విభాగంలో వైద్య పరికరాలు పనిచేయక సర్జరీ సేవలు నిలిచిపోగా, జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానలో నీటి కష్టాలు వెంటాడుతున్నాయి.
- జగిత్యాల ప్రభుత్వ దవాఖానలో రోగులకు తిప్పలు
- బాత్రూంలో నీరు రాక అవస్థలు
- పట్టని అధికారులు
జగిత్యాల, జూన్ 10 : కేసీఆర్ పాలనలో కార్పొరేట్‌కు దీటుగా సేవలందించిన ప్రభుత్వ దవాఖానలు ఇప్పుడు మొండికేస్తున్నాయి. సర్కారు నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని ఆర్థోపెడిక్ విభాగంలో వైద్య పరికరాలు పనిచేయక సర్జరీ సేవలు నిలిచిపోగా, జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానలో నీటి కష్టాలు వెంటాడుతున్నాయి.
బావి, బోరు బావి ఎండకాలంలోనే ఎండిపోగా, పది రోజల నుంచి కటకట మొదలైంది. దీంతో 24 గంటల పాటు మున్సిపల్ నల్లా నీరు వచ్చేలా ఏర్పాటు చేసినా.. కొద్ది రోజులుగా అది కూడా బంద్ అయింది. దీంతో రోజుకు రెండు మున్సిపల్ ట్యాంకర్లను తెప్పిస్తున్నా.. అవి కూడా సరిపోవడం లేదు. ఈ దవాఖానలో ఇన్పేషెంట్లుగా వంద మంది ఉండగా, అలాగే ప్రతి రోజూ 200 దాకా ఓపీ ఉంటున్నది.
పక్క జిల్లాలు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ నుంచి కూడా వివిధ పరీక్షలు, చికిత్సల కోసం వస్తున్నారు. ప్రస్తుతం నీరు సరిపోక రోగులు, సహాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూత్రశాలల్లో నీరు రాక అవస్థలు పడుతున్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో రోగుల బంధువులు బస్టాండ్‌లో ఉండే నల్లా, బోర్ల నుంచి నీటిని తీసుకొచ్చుకుంటున్నారు. ఎండపూట గోస పడుతున్నామని వాపోతున్నారు. రోగులు నీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతుంటే.. సిబ్బంది ఉపయోగించే కూలర్లలో మాత్రం నీరు ఉండడంపై మండిపడుతున్నారు. అధికారులు పట్టించుకోవాలని వేడుకుంటున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

