తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామ పంచాయతీకి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు అంతర్జాతీయ నాణ్యత ధ్రువీకరణ (ఐఎస్వో 9001-2015) పత్రాన్ని గ్రామ సర్పంచ్ మాదాడి భారతికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి అందజేశారు.
ఇక్కడ బీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి మాదాడి రమేశ్‌రెడ్డి, ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్ పాల్గొన్నారు.
– తిమ్మాపూర్, జూన్ 16