parent-teacher meetings | రుద్రంగి, సెప్టెంబర్ 25: రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీటింగ్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు అబ్జర్వర్ రమణారావు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన గురువారం పర్యవేక్షించి ఉపాధ్యాయులకు పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై పలు సూచనలు, సలహాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల చదువు, క్రమశిక్షణ పట్ల ఉపాధ్యాయుల పాత్ర ఎంత ఉంటుందో తల్లిదండ్రుల పాత్ర అంతే ఉంటుందన్నారు. విద్యార్థులు చదువు, హాజరు, ప్రవర్తనపై విద్యార్థుల తల్లిదండ్రుతో చర్చించినట్లు పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, డ్రాపౌట్స్ తగ్గిందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భార్గవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.