Parents protest | గంగాధర, అక్టోబర్ 28:గంగాధర, అక్టోబర్ 28: కరీంనగర్, గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ ఎండి యాకుబ్ పాషా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకువాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు నిరసనకు దిగారు. కాగా పోలీసులు పాఠశాల వద్ద బందో బస్త్ ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులను పాఠశాలలోకి అనుమతించకపోవడం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జగిత్యాల జాతీయకరీంనగర్, గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ ఎండి యాకుబ్ పాషా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో భాద్యులైన వారిపై చర్యలు తీసుకువాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు నీరసనకు దిగారు. రహదారిపై రాస్తారోకో చేశారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు. తల్లిదండ్రుల నీరసనకు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన అటెండర్ యాకుబ్ పాషాను జెడ్పిసిఈవొ శ్రీనివాస్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ యాకూబ్ పాషా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో వెంటనే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముగ్గురు సభ్యుల అధికారుల బృందాన్ని విచారణకు ఆదేశించారు.
విచారించిన బృందం తమ నివేదికను కలెక్టర్ కు సమర్పించింది. ప్రధానోపాధ్యాయురాలు కమల జరిగిన సంఘటనను దాచిపెట్టాల్సిందిగా పాఠశాల సిబ్బందిని బెదిరించారని, విద్యార్థుల భద్రతను ఆమె విస్మరించారని, జరిగిన సంఘటనను ఉన్నతాధికారులకు తెలియజేయకుండా వాస్తవాలు దాచారని విచారణ కమిటీ తమ నివేదికలో వెల్లడించింది.దీంతో కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమలను విధులనుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అమలులో ఉన్నంతకాలం ప్రధానోపాధ్యాయురాలు కమల ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళరాదని ఆదేశించారు.
పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరికీ షో కాజు నోటీసులు జారీ చేసి, ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రభుత్వ పాఠశాలకు వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులకు మద్దతు తెలిపారు. యాకుబ్ పాషాను సర్వీస్ రిమూవల్ చేయాలని, బాధ్యులైన ప్రతీఒక్కరి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కురిక్యాల సంఘటనలో బాధ్యులైన ప్రతీ ఒక్కరి పైన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ నికోలస్ మాట్లాడినట్టు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.