
Chintakunta | కథలాపూర్, జూన్ 1 : కథలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు. ప్రజావాణిలో అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, ఉపసర్పంచ్, సర్పంచ్ అందరూ కలిసి ప్రజావాణి హాల్లో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు చేసేంతవరకు ఉద్యమం చేస్తామని గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగం భూమయ్య, ఉప సర్పంచ్ పోకతోట లింబాద్రి, వార్డు సభ్యులు అందే రాణి, చెదలు అంజమ్మ, రెబ్బసు సుజాత , అంగ గంగు, బోదాస్ అంజయ్య, నేతుల మహేష్, నాయకులు రెబ్బాస్ రాజం, తోట రాకేష్ , రెంకల నరసయ్య, శేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.