MLA Vijayaramana Rao | కాల్వ శ్రీరాంపూర్ డిసెంబర్, 21 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట్ గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు ఆదివారం పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణారావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
సర్పంచ్ పురుషోత్తం భాగ్య రవి, ఉపసర్పంచ్ కడెం మహేష్ కుమార్ ఆధ్వర్యంలో వార్డ్ మెంబెర్స్ మాదాసు హరీష్, మచ్చ సంపత్, కందునూరి శారద, అరవింద్, ఏగొలపు కవిత, లక్ష్మీనారాయణ, పురుషోత్తం అనిత, మహేందర్ ఎమ్మెల్యేలు కలిసి పుష్పగుచ్ఛం అందించి, గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు.