ప్రముఖ సంస్కృత భాషా పండితుడు, కవి, మహా మహోపాధ్యాయ, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి బుధవారం తెల్లవారు జామున కరీంనగర్‌లోని నివాసంలో అస్తమించారు. కాగా, శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సంతాపం వ్యక్తం చేశారు.
విజయసారథి మృతదేహంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతా రావు, సుడా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, సీపీ వీ సత్యనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాల్‌రావు, పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సాహితీవేత్తలు పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. -కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 28