కరీంనగర్ తెలంగాణచౌక్, సెప్టెంబర్19 : బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నది. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు ఈ నెల 20 నుంచి అక్టోబర్ 1 వరకు 1321 బస్సులను, పండుగలు ముగిసిన తరువాత కరీంనగర్ నుంచి హైదరాబాద్ చేరుకోడానికి అక్టోబర్ 2 నుంచి 13 వరకు 1330 బస్సులను నడిపించేలా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఈ నెల 20న 180, 21న-110, 22న 50, 23న 50, 24న 50, 25న 50, 26న 78, 27న 203, 28న 190, 30న 90, అక్టోబర్ 1న 100 బస్సులను జేబీఎస్ నుంచి కరీంనగర్ బస్టాండ్‌కు నడిపించనున్నారు. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 2 న 30, 3న 80, 4న 200, 6న 210, 7న 100, 8న 80, 9న 80, 10న 50, 11న 40, 12న 200, 13న 180 బస్సులు నడవనున్నాయి. ప్రత్యేక బస్సులో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉందని ఆర్ఎం రాజు తెలిపారు.