Kakatiya Colony | హుజూరాబాద్, జూన్ 16: మా దారిలోనుంచి వెళ్లొ ద్దంటూ ఆర్టీసీ అధికారులు డిపో దగ్గర రోడ్డుకు అడ్డంగా కందకం తీయించడంతో స్థానిక కాలనీవాసులు ఇబ్బం దులు పడుతున్నారు. ఏండ్ల నుంచి ఉన్న దారిని మూసి వేయడంతో మరో మార్గంగుండా తిరిగి ప్రయాణిం చాల్సి వస్తున్నదని వాపోతున్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద గల రోడ్డుకు కాకతీయ కాలనీలో గల ఓ రోడ్డు కలుస్తున్నది.
ఈ రోడ్డు దాదాపు డిపో ప్రారంభమైన ప్పుడే ఉందని కాలనీవాసులు చెబుతుండగా, తమకు ప్రభుత్వం స్థలం కేటాయించినప్పుడు ఈ దారి లింకు లేదని, అందుకే రోడ్డు అడ్డంగా కందకం తీశామని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఓ రోడ్డు నుంచి ఇంకో రోడ్డుకు వెళ్లాలంటే అనుసంధానం కావడం సహజమని.. ఎప్పటి నుండో నడుస్తున్న రోడ్డును మూసి వేయడం తగదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. మున్సిపల్ అధికారులు కలుగజేసుకొని దారికి గల అడ్డంకులు తొలగించాలని కోరుతున్నారు.