Operation No Number Plate | జగిత్యాల : జగిత్యాల పట్టణంలో జగిత్యాల టౌన్ పోలీసులు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్, బండి పత్రాలు సరిగ్గా లేని 70 వాహనాలను గుర్తించి, వాటిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారికి చలాన్లు విధిస్తూ వాహనదారులకు నంబర్ ప్లేట్ తప్పనిసరిగా అమర్చుకోవాలని కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఇకపైన జగిత్యాలలో వాహందారులందరూ నంబర్ ప్లేట్లు సరిగా ఉండే విధంగా చూసుకుంటూ ట్రాఫిక్ రూల్స్ ని క్రమం తప్పకుండా పాటించాలని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.