Chadha Venkat Reddy | చిగురుమామిడి డిసెంబర్ 11 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే వారిని గెలిపించాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చిగురుమామిడిలో కుండలు చేస్తూ అభివృద్ధి చేసే అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాచేత ఎన్నుకోబడిన వారి పరిపాలనలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని స్థానిక సంస్థలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు విధులు నిధులు ఉన్నాయని, వాటిని దుర్వినియోగం చేయకుండా గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని అన్నారు. ఎన్నికలప్పుడు ఉచిత వాగ్ధానాలు చేసి గెలిచిన వారిని నమ్మొద్దన్నారు. వీరి వెంట సీపీఐ జిల్లా నాయకులు గూడెం లక్ష్మి, బూడిద సదాశివ, చాడ శ్రీధర్ రెడ్డి, బోయిని పటేల్, మావురపు రాజు, ముద్రకోల రాజయ్య, బోయిని అశోక్ తదితరులు ఉన్నారు.