Collector Koya Sri Harsha | పెద్దపల్లి ఆగస్టు 25: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే పూజించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజలను కోరారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మట్టి వినాయక విగ్రహా పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు.
కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేస్తూ పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మట్టి గణపతులను పూజించాలని జన సంచారం ఉన్న ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రంగా రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ భిక్షపతి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ బండి ప్రకాష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.