kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్ నవంబర్ 1 . కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై నిర్మించిన అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, మాలికాపురత్తమాంబ, నవగ్రహ, పంచముఖ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన పూజలు రెండో రోజు అంగరంగ వైభవంగా కొనసాగాయి.
ప్రతిష్టాపన ఉత్సవాల్లో వేద పండితులచే మహాగణపతి పూజ, పుణ్య వచనం, వాస్తు పూజ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, గణపతి హోమం, ఉత్సవ విగ్రహాలకు పంచామృత అభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పూజా వేడుకల్లో మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రతిష్టాపన వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అయ్యప్ప సేవా సంఘం కమిటీ సభ్యులు కోరారు.