Road accident | తిమ్మాపూర్,ఫిబ్రవరి21: బంధువు అంత్యక్రియలకు వెళ్తూ సొంత మామ అల్లుడు మృతి చెందిన విషాదకర సంఘటన తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులో చోటుచేసుకుంది. మృతుల బంధువుల ప్రకారం.. మానకొండూరు మండలం కొండపల్కల గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు శ్రీరాముల రామచంద్రం ఆయన సొంత అల్లుడు హుస్నాబాద్ కు చెందిన అవుధూర్తి శ్రీనివాస్ కలిసి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలోని రామచంద్రం మరదలు మృతి చెందారు.
కాగా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇద్దరు కలిసి శనివారం ఉదయం 11 గంటలకు రామచంద్రం బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులో మోయ తుమ్మెద వాగు బ్రిడ్జి సమీపంలో కారు వెనుక నుండి అతివేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.
సొంత మామ అల్లుండ్లు మృతి చెందడంతో రెండు కుటుంబాలతో పాటు రెండు గ్రామాల్లో విషాద ఛాయాలనుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి సీఐ సదన్ కుమార్, ఎస్సై అన్వర్ చేరుకుని మృతదేహాలను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఓకే కుటుంబంలో మామ అల్లుళ్లు మృతి చెందడంతో ఆస్పత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.