గోదావరిఖని/అంతర్గాం, ఫిబ్రవరి 18: సీఎం కేసీఆర్ పుట్టిన రోజున రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పెద్ద మనసు చాటారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద పేదలకు చేయూతనిచ్చారు. గో దావరిఖని 12వ డివిజన్‌కు చెందిన ఓ నిరుపేద కుటుంబానికి ఆటోను, 42వ డివిజన్ కళ్యాణ్‌నగర్‌లోని రాజన్నల గొర్రెల, మేకల సహకార సంఘానికి వాటర్ కూలర్‌ను అందజేశారు. 12వ డివిజన్‌కు చెందిన కొట్టూరు సత్యనారాయణ కరోనాతో మృతి చెందగా కార్పొరేటర్ బొడ్డు రజితా రవీందర్ సూచన మేరకు సత్యనారాయణ ఇద్దరు కొడుకులకు ఆటోను స్టేడి యం గ్రౌండ్లో అందజేశారు. అంతర్గాం మం డలం గోలివాడకు చెందిన రాజమ్మకు సొంత ఖర్చులతో ఇల్లు కట్టించేందుకు ముందుకొచ్చి, శుక్రవారం భూమి పూజ చేశారు. మేయర్ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు బాలరాజ్‌కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతినాయక్, వైస్ ఎంపీ పీ లక్ష్మీ మహేందర్‌రెడ్డి, సర్పంచులు రాజేశ్, కృష్ణ, వెంకటమ్మ బాదరవేని స్వామి, దేవమ్మ రాములు, సతీశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.